NTV Telugu Site icon

Etela Rajender: కేసీఆర్ ఓడిపోతే ఉద్యోగాలు వస్తాయనే కాంగ్రెస్కు ఓటేశారు..

Etela

Etela

ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేసి కేసీఆర్ ఓడిపోతేనే తమకు ఉద్యోగాలు వస్తాయని.. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు. నిరుద్యోగులు రెండే డిమాండ్ చేస్తున్నారు.. ఒకటి ఉద్యోగాల సంఖ్య పెంచి నోటిఫికేషన్ తిరిగి ఇవ్వమంటున్నారు. రెండవది పరీక్షకు పరీక్షకు మధ్యలో గ్యాప్ ఉండేలా ఎక్సమ్ డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు. విద్యార్థులు బయట ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు.. ఇళ్లలోనే కూర్చొని నిరాహారదీక్ష చేస్తున్నారు.. అలాంటి వారి మీద లాఠీచార్జీలు చేస్తున్నారు.. కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారని ఈటల పేర్కొన్నారు. వారు అనుభవిస్తున్న నరకం చూస్తుంటే బాధ అనిపిస్తుందని అన్నారు.

Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్..

మొత్తం విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు ఈ ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహ్యం కలిగిందని ఈటల రాజేందర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పారో దానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతును అందిస్తుంది.. వారు చేసే ఉద్యమాల్లో తాము ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. బీజేవైఎం తెగించి ఆందోళన చేస్తుంది.. లాఠీచార్జీ చేసిన, జైల్లో పెట్టిన వెనకడుగు వేయడం లేదు.. తాము కూడా వెంట ఉంటామని ఈటల తెలిపారు. ప్రభుత్వం పేషజాలకు పోకుండా వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Boeing plane: గాల్లో ఉండగా ఊడిన విమానం టైర్.. తప్పిన ముప్పు

ఇదిలా ఉంటే.. పీర్జాదిగూడలో హృదయవిధారక పరిస్థితి ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు నెలకి 500 రూపాయల ఇన్స్టాల్మెంట్ కట్టి 100 గజాలు 200 గజాలు కొనుక్కున్నారని అన్నారు. వారికి మునిసిపల్, జీహెచ్ఎంసి పర్మిషన్ తో పాటుగా అన్ని రకాల అనుమతులు ఉండి ఇల్లు కట్టుకున్నారన్నారు. అంతా పూర్తయ్యాక ఇప్పుడు వారి ఇళ్ళను కూల్చివేయడం సరికాదు.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కూల్చివేతలు అని మండిపడ్డారు. పేదల జోలికి పోతే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. పేదల జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి లేదు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గులాంగిరి చేసిన అధికారులు జైలపాలయ్యారు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నామని ఈటల తెలిపారు. పేదలకు ఇబ్బంది పెడితే వారి జేజమ్మతోనైనా కొట్లాడటానికి సిద్ధం అని అన్నారు.