Site icon NTV Telugu

Etela Rajender : వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు…

Etela Rajender

Etela Rajender

ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్‌ రెడ్డి తనపై ఈటల చేసిన ఆరోపణలపై చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు. అయితే.. దీనిపై తాజాగా ఈటల రాజేందర్‌ స్పందస్తూ.. సింగరేణి పై నేను మాట్లాడిన.. నేను ఎవరి పైన వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి పైన మాట్లాడలేదని, ఢిల్లీ కేంద్రంగా జాతీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయని అన్నానన్నారు.

Also Read : Kerala : లోయలో పడిన టూరిస్ట్ బస్సు.. కేరళలో ఘోరం

బీజేపీనీ ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకున్నాయని ఆయన విమర్శించారు. ఖర్గే, కేకే కలిసి మాట్లాడతారని, రాహుల్ గాంధీ సూరత్ కోర్ట్ తీర్పు పై బీఆర్‌ఎస్‌ ఆయనకు మద్దతుగా మాట్లాడిందన్నారు. వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడని, రేవంత్ రెడ్డి కన్నీరు పెడుతూ సంస్కార హీనంగా మాట్లాడారన్నారు. నేను విద్యార్థి దశలోనే రెండు సార్లు జైలుకు వెళ్లానని, మేము తెలంగాణ గురించి కొట్లడినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నావు… చంద్రబాబు పంచన చేరావు అంటూ ఆయన ధ్వజమెత్తారు. తుపాకీ పట్టుకొని వచ్చింది నువ్వు అని, నాకు నీకు ఏమీ పోలిక రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. నువ్వు జైలుకు ఓటు కు నోటు కోసం పోయావు… ప్రజల కోసం పోలేదని ఆయన అన్నారు.

Also Read : Government School Uniform : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న పాఠశాలల యూనిఫాం

Exit mobile version