హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రతి పక్ష పార్టీలు ఉండొద్దని గందరగోళం సృష్టించాలని కేసీఆర్ అనుకున్నాడని, కాంగ్రెస్ నేతలను ప్రలోభ పెట్టి తీసుకుపోయారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల చేతిలో చిక్కి తానే నాశనం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడని, తెలంగాణ పల్లెల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు అనే ఒకటే చర్చ జరుగుతోందన్నారు. ఈ కేసీఆర్‌కు ఓటు వేయద్దని డిసైడ్ అయ్యారని, కౌలు రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని వ్యాఖ్యానించారు.
Also Read : WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?
తెలంగాణ మోడల్ కావాలని ఇతర రాష్ట్రాల లో చెబుతున్న కేసీఆర్ కౌలు రైతులకు ఏమీ చేస్తున్నావో చెప్పు అని ఆయన అన్నారు. ధరణి వచ్చాక పేదల భూములు మాయమై పోయాయని, కేసీఆర్ కుటుంబం కబ్జాలకు పనికి వచ్చిందని, వాళ్ళకు పైసలు తెచ్చి పెట్టిందన్నారు. ధరణి పై మొన్ననే జేపీ నడ్డా చెప్పారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక నష్ట పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. సర్వేలకు అందని ఫలితాలు తెలంగాణలో వస్తాయన్నారు. మా కార్యకర్తలు ఇంటింటికి బీజేపీ పేరుతో వెళితే మంచి స్పందన వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ గెలిచిందని, లేక అధికార పార్టీ గెలిచిందన్నారు. కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయి దృష్టి పెట్టిందని, చాప కింద నీరులా బీజేపీ పని జరుగుతుందన్నారు ఈటల రాజేందర్.
Also Read : Coconut Burfi : కొబ్బరి బర్ఫిని ఇలా చేసుకోవచ్చు.. టేస్ట్ చూస్తే వదలరు…!
