NTV Telugu Site icon

Etela Rajender : ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ఎందుకు జాప్యం..

Etela

Etela

రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలులో విఫలం అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే కర్తవ్యాలు మాకు ఉంటాయన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చటం లో ఎందుకు జాప్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సూటి ప్రశ్న అడుగుతున్నామన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది.. రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. కొత్త పెన్షల మాట దేవుడు ఎరుగు,ఉన్న పెన్షన్ లు పీకేస్తున్నారని, మూసీ ప్రక్షాళన కోసం లక్ష కోట్లు అనేది హాస్య పదమన్నారు.

  Akira Nandan: పవన్ ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్

మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే రకంగా ఉందని, ప్రజల దృష్టి మరల్చి ప్రయత్నాలు మానుకోండన్నారు ఈటల. హైడ్రా సమస్య,మూసి ప్రక్షాళన పై పోరాటం చేస్తామని, జీవో 29 దుర్మార్గమైన జీవో.దీన్ని సవరించాలన్నారు ఈటల రాజేందర్‌. రాజ్యాంగ బద్ధంగా జీవో లను అమలు చేయాలని, బండి సంజయ్ ర్యాలీ నీ అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నామన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షలు వాయిదా వేయాలని, 50 శాతం రిజర్వేషన్ మెరిట్ ప్రకారం కేటాయించాలన్నారు.

 IND vs NZ: 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా..