Site icon NTV Telugu

Etela Rajender : బీజేపీ తరపున బాధిత రైతులకు సంపూర్ణ మద్దతు అందిస్తాం

Etela Rajender

Etela Rajender

రంగారెడ్డి జిల్లా యాచారం మేడిపల్లి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఫార్మసీటీ భూ బాధితుల పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. రెండో రోజు ఫార్మాసిటీ బాధితుల పాదయాత్ర కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ఈ పాదయాత్ర సాగింది. పాదయాత్ర కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. విషపూరిత ఫార్మా కంపెనీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయొదంటూ నినాదాలు చేస్తూ బాధితుల పాదయాత్ర సాగింది. మార్కెట్ ధర ప్రకారమే రైతులకు డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు బాధితులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఫార్మాసిటీకి బీజేపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమన్నారు ఈటల.
Also Read : Bandla Ganesh: కమ్మ- కాపు వర్గ పోరుపై బండ్ల వివాదస్పద వ్యాఖ్యలు.. అదో పెద్ద రోత రాజకీయం

రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసి కోట్ల రూపాయలను సంపాదించుకుంటుందని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఈ ప్రాంతంలోని తీసుకున్న భూములను ప్రత్యానయంగా మరో ప్రాంతంలో రైతులకు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల కళ్లలో మట్టి కొట్టి పరిపాలన చేస్తామంటే చెల్లదు కాక చెల్లదని ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలమంది ప్రజానీకం రైతాంగానికి అండగా నిలబడతారని అన్నారు. బీజేపీ తరపున బాధిత రైతులకు సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇస్తామని ఫార్మా కంపెనీ పెద్దలను హెలికాప్టర్లలో తిప్పి ఏడు సంవత్సరాలు అయిపోయిందని గుర్తు చేశారు ఈటల రాజేందర్‌. కానీ ఇప్పటి వరకు ఆ రైతులకు నష్ట పరిహారం అందించలేదని ఫైర్ అయ్యారు. గ్రామసభలు నిర్వహించకుండా వారి అభిప్రాయాన్ని గౌరవించకుండా బెదిరించి భూములు లాక్కుంటున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Exit mobile version