రాములు నాయక్, మదన్ లాల్ లను కేసీఆర్ తీవ్రంగా అవమానించారని, కేసీఆర్ దొర దగ్గర అందరూ జీతగళ్ళలాగా ఉండాలి అనే భావనతో ఉన్నారని విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన నియోజకవర్గాలు ఎక్కువ ఉన్న జిల్లా ఖమ్మం అని, 5 నియోజకవర్గాలు ఉన్నాయని, ఆనాదిగా అడవిని, భూమిని నమ్ముకొని బ్రతికే బిడ్డలు గిరిజన బిడ్డలు.. ఇక్కడే ఉంటారన్నారు. వారికి సుఖం, శాంతి నిండు జీవితం అడవుల్లోనే ఉందని, అలా బ్రతికే వారిని కేసీఆర్ హింస పెడుతున్నారని మండిపడ్డారు. భూముల్లోకి పోకుండా ట్రెంచ్ లు కొట్టారు. మా భూముల్లోకి రావొద్దు అని గిరిజన ఆడబిడ్డలు అడిగితే ఫారెస్ట్ అధికారులతో బూటు కాళ్ళతో తన్నించారని ఈటల ధ్వజమెత్తారు.
Also Read : G20 Summit: జీ20లో కీలక పరిణామం.. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
మిర్చికి మద్దతు కావాలని రైతులు అడిగితే ఇదే ఖమ్మం జిల్లాలో సంకెళ్లు వేయించిన.. మరచిపోని గాయాలు ఎన్నో. ఇన్నీ చేసి దశాబ్ది ఉత్సవాల పేరిట మళ్లీ ఊర్లకు వచ్చి గొర్రె పోతులు కోసి దావతులు ఇస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేయడంతో అలసత్వం వల్ల రైతుకు నష్టం వచ్చింది. క్విటాకు 10 కేజీల ధాన్యం కట్ చెయ్యడమే కాదు మిల్లుకు ట్రాక్టర్ పంపితే 5 వేలు లంచం ఇస్తే కానీ దించుకొలేదని ఈటల వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క కిలో కూడా తరుగు లేకుండా కొనే జిమ్మేదార్ మాది అని ఈటల హామీ ఇచ్చారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి మిగతా సబ్సిడీ పరికరాలు అన్నీ ఎగబెట్టారు. పంట నష్టపోతే కేంద్రం అందించే ఫసల్ భీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకుండా నష్టపరిహారం అందకుండా చేసినవాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. తాను ఇస్తా అన్న పది వేల రూపాయలు కూడా ఇవ్వలేదని, బీజేపీ వస్తె ఫసల్ భీమా యోజన అమలు చేస్తామన్నారు. బీజేపీ ఎక్కడ ఉంది అని అంటున్నారు.. ఎన్టీఆర్‌నీ కూడా ఇలానే అన్నారు. కానీ గుద్దుడు గుద్దితే కాంగ్రెస్ దిమ్మ తిరిగిందని ఈటల గుర్తు చేశారు. ఎందందు వెదికినా అందందు బీజేపీ ఉందని, ఖమ్మం చైతన్యవంతం అయిన జిల్లా.. మార్పు కోరుకునే జిల్లా.. నిర్భందాలకు లొంగదు. తెలంగాణ ఉద్యమంలో మొదటి తూట పేలింది ఇక్కడే.
Also Read : Nedurumalli Ram Kumar: చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీంను స్కాంగా మార్చారు
నేను మాట ఇస్తున్నా.. బీజేపీనీ ఆశీర్వదిస్తే.. 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తాం. ముసలి వాళ్ళు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం. ఆడబిడ్డలు సాయంత్రం అయింది అంటే బిక్కుబిక్కమంటున్నారు. మారుమూల పల్లెల్లో కూడా బెల్ట్ షాపులు పెట్టీ మద్యం అమ్ముతున్నారు. గిరిజన గూడెల్లో సారా బట్టీలు తీసేసి కెసిఆర్ లిక్కర్ ను అమ్ముతున్నారు. ప్రతి వందమంది మగవాళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టారు. సంపాదించిన పైసలు అన్నీ తాగుడికే పోతున్నాయి. పెన్షన్, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, భీమా అన్నీ కలిసి కెసిఆర్ ఇస్తున్న డబ్బులు 25 వేల కోట్లు అయితే మద్యం ద్వారా మనదగ్గర లాక్కుంటున్న డబ్బులు 45 వేల కోట్లు. రైతురుణమాఫీ డబ్బుల కోసం రింగు రోడ్డు కుదవపెట్టారు, భూములు అమ్ముతున్నారు. దసరా పండుగకు పాడాల్సిన మద్యం వేలం పాట ఇప్పుడే పాడి 2600 కోట్లు తెచ్చి ఇస్తున్నారు. హైదరాబాద్ లో చిన్న అమ్మాయినీ కత్తులు పట్టుకొని చేరిచారు. గిరిజన మహిళను పోలీసులే చెప్పకూడని చోట కొట్టారు. దళిత, గిరిజన ఆడబిడ్డల మీద ఎన్ని దాడులు జరిగినా కెసిఆర్ పట్టించుకోవడం లేదు. బీజేపీ మీటింగ్ కి వేస్తే పెన్షన్ అపుతా అని బెదిరిస్తున్నారట.. ఈ డబ్బులు నీ అబ్బ జాగీరు కాదు.
నీ కారు నడిచేది మా చెమట పైసలతో. సంక్షేమ పథకాలు వాటిని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ప్రజల పైసలతో సోకులు పడుతున్న వారు కేసీఆర్. తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం. వారికి ఏం కావాలో తెలిసిన వాళ్ళం.’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.