NTV Telugu Site icon

Etela Rajender : కేసీఆర్‌ విద్యార్థుల విశ్వాసం మీద దెబ్బకొట్టారు

Etela

Etela

ఉమ్మడి వరంగల్ జిల్లా ( 6 జిల్లాల )  కోర్ కమిటీ సభ్యుల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 15న వరంగల్ జరగనున్న నిరుద్యోగుల మార్చ్ కార్యక్రమానికి సన్నాహక సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ర్యాలీలపై నిషేదం విధించారన్నారు. విద్యార్థి నాయకుడిగా పనిజేసినప్పటి నుండి చూస్తున్నా ఎప్పుడు ఇలా లేదని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. అపద వచ్చినప్పుడు అండగా ఉంటాము అనే భరోసా మనం ప్రజలకు కలిపించాలని, ఇంత దారుణమైన విఫలం ఎప్పుడు లేదన్నారు.

Also Read : Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీల జాతీయ గుర్తింపు రద్దు.. బీఆర్‌ఎస్‌కు షాక్‌

ఆరింటికి ఆరు పరీక్షలు లీక్ అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ విద్యార్థుల విశ్వాసం మీద దెబ్బకొట్టారని ఈటల దుయ్యబట్టారు. పైరవీలకు, డబ్బులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్‌ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక చిన్న ఇష్యూ ప్రజలను అందరినీ ఏకం చేస్తుందని, TSPSC పేపర్ లీకేజీ కోటి మందికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. కేసీఆర్ పెట్టిన హిందీ పేపర్ లీకేజీ కేసు ఒక మోసమని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్ ర్యాలీ తెలంగాణకు పొలికేక కావాలి అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఈ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, నిరుద్యోగులకు నమ్మకం కలిగిద్దాం అని ఈటల రాజేందర్ కోరారు.

Also Read : Extramarital Affair: ప్రియుడితో కలిసి భార్య స్కెచ్.. ఇంట్లోకి రాగానే..