Etela Rajender : అధికారం శాశ్వతం కాదని కేటీఆర్ గొప్ప మాట అన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే.. శాసన సభలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని, సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామన్నారని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Wolf 1069 b: భూమికి అత్యంత సమీపంలో భూమిలాంటి గ్రహం..
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
అయితే.. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదని కేటీఆర్ గొప్ప మాట అన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పన్నుల ద్వారానే నడుస్తాయని, దేశానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నారు. ధరణి సమస్యలను ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం ఇవ్వకుండా పేదల నుంచి లాక్కుంటుందని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెరిగాయి అన్నారు… రాష్ట్రం పెట్రోల్‌పై పన్ను వేయదా? అని ఆయన అన్నారు. సెలూన్లకు ఇస్తామన్న వంద యూనిట్లు ఉచితంగా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ జీతాలు మొదటి వారంలో రావడం లేదని, గ్రామ సర్పంచ్ లకు, కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేవారు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకొని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటల. ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.
Also Read : Akhil Agent: అయ్యగారు మరీ వైల్డ్ గా ఉన్నారు…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!