ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు ధాన్యం కొనుగోలు కేంద్రంను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మంత్రులకు నాయకులకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో దావత్ ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. మా రాష్ట్రంలో రైతులు మూడు పువ్వులు ఆరు కాయలు గొప్పగా.. ఆర్థికంగా బాగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి హర్యానా, పంజాబ్ మద్యప్రదేశ్, పోయి చెప్తుడు… కానీ గురిగింజ తన కింద ఉన్న నలుపు ని చూసుకోనట్లుగా ముఖ్యమంత్రిది ఉందని, రైతులు నెల రోజులుగా తారుపాలు పట్టుకొని కళ్లాల్లో ఉంటూ కాంటాలు వేయకపోవడంతో కల్లాలే ఇళ్లను చేసుకొని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నవ్ ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదని చెప్పినవ్ కానీ ఈ రోజు రైతు, ఎద్దు రెండు ఏడుస్తున్నాయన్నారు. అంతేకాకుండా.. ‘కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలి.. జీతాలు తీసుకునే కలెక్టర్లు రైతుల బాధలు తీర్చాలి. అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ 600 గ్రాముల కంటే ఎక్కువ తరుగు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఇక్కడేమో పది కేజీలు పదిహేను కేజీల తరుగు తీస్తున్నారు.
Also Read : Shalini Pandey: ప్రీతి.. నువ్వు ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?
నేను వస్తున్నా అని కేంద్రాలకు హడావుడిగా బస్తాలు పంపి కాంటాలు వేస్తాం ఎవరూ పోవద్దని రైతులకు చెబుతున్నారు’ అని ఈటల అన్నారు. దీంతో పాటు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతు గా ఈటల రాజేందర్ కామెంట్స్ చేశారు. గత 13 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుతుందని, ఇచ్చిన హామీ అమలు చేయాల్సిన చోయి ప్రభుత్వం మరిచి పోయిందన్నారు. ‘చిన్న ఉధ్యోగుల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది.. పంచాయతీ కార్యదర్శులు చేసిన కృషికి రాష్ట్రానికి మంచి పేరొఛ్చింది…గ్రామాల్లో రోజుకు 14 గంటలు పనిచేస్తున్న జెపిఎస్ లను అబినందించాల్సిన ప్రభుత్వం బెదిరిస్తుంది… జెపిఎస్ లు చిన్న ఉద్యోగులే కావచ్చు కానీ ప్రజల మద్దతు వారికుంది… పంచాయతీ కార్యదర్శులను అవమానిస్తే ప్రజలను అవమానించినట్లే…. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి…. మీ సమ్మె కు బిజెపి అండగా ఉంటుంది…. పంచాయతీ సెక్రటరీలు ఒంటరి కాదు వారి తరుపున అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం… కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దెగ్గరకు వచ్చింది’ అని ఆయన అన్నారు.