NTV Telugu Site icon

Etela Rajender : గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవడమే కాదు

Etela

Etela

గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్‌. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు షేర్ తేడా కేవలం 4 శాతం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పెట్టిన ఎఫర్ట్ పెట్టాలని, అన్ని లోకల్ బాడీ ఎన్నికల ప్రాధాన్యత గుర్తించాలన్నారు. కేసీఆర్ చీ అనిపించుకోవడానికి ఆరేళ్ళు పట్టింది… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో చీ కొట్టించుకోవడానికి 9 నెలలు కూడా పట్టలేదని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణా ప్రజల విశ్వాసం కోల్పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్లు మాట్లాడుతున్నారని, తాత్కాలికంగా విజయం సాధించవచ్చన్నారు ఈటల రాజేందర్‌.

Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్ రెడీగా ఉండండమ్మా…

అంతేకాకుండా..’సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న వారికి N కన్వెన్షన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. హస్మత్ చెరువు కింద 120 మంది పేదలకు నోటీసులు ఇచ్చారు. ఫిరంగి నాల ముసుకుపోయింది. చెరువుల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములు కావు. పేదల ఇండ్లు కులగొట్టడం మీ తరం కాదు. పేదల జోలికి వస్తే ఖబడ్దార్. ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించు ఇచ్చి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేలిపోవడం ఖాయం. రేవంత్ రెడ్డి చిట్టా రాస్తున్నాం.. సందర్భం వచ్చినప్పుడు బయటకు తీస్తాం. తెలంగాణ వాళ్లకు పాలించడం చేతకాదని హేళన చేసేవాళ్ళు.. రేవంత్ రెడ్డిని చూస్తే అదే నిజం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కి న్యాయ స్థానాలను గౌరవించడం కూడా తెలియదు. సుప్రీం కోర్టు తీర్పు పై సిఎం హోదాలో మాట్లాడటం బాధాకరం.’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు