Etela Rajendar: బీఆర్‌ఎస్ పార్టీని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. సెంటిమెంటు మీద ఆధారపడి ఎల్లకాలం రాజకీయాలు నడవవన్నారు. 2015లోనే ఫోన్ ట్యాపింగ్‌పై చర్చ జరిగిందన్నారు. మంత్రులందరిపైనా నిఘా పెట్టాల్సిన దౌర్భాగ్యం వస్తే ఇంకేమి పాలన అంటూ ఈటల వ్యాఖ్యానించారు. సహచరుడిపై నమ్మకం లేకపోతే, నువ్వేమి నాయకుడివి అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత మంత్రులపై ఫోన్ ట్యాపింగ్ చేయడమేంటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేశామని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని ఈటల పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. 2015 నుంచే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలుసన్నారు.
Read Also: Etela Rajendar: ఈటలను ఓడించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు..
ఓబీసీలను టీఆర్‌ఎస్ పార్టీకి అటాచ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశానన్న ఈటల రాజేందర్.. ఎల్లప్పుడు బాధితుల పక్షాన కొట్లాడానన్నారు. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో పార్టీ పెట్టాలని ప్రతిపాదన ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క బీసీ కూడా రాష్ట్రానికి సీఎం కాలేకపోయారని ఈటల తెలిపారు. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితి లేదు, ముదిరాజ్‌లకు మంత్రిపదవి వచ్చే అవకాశం లేదన్నారు. కులపరంగా తనకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. స్వయంకృషితో ఎదగడం వల్ల తన పని వల్లే మంత్రి పదవి దక్కిందన్నారు.