NTV Telugu Site icon

Etala Rajender: 25 నుండి 30 సీట్లు బీజేపీకి వస్తాయి

Etala

Etala

పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం, యువత, మహిళలు మార్పు రావాలి.. ఆ మార్పు బీజేపీకి రావాలి అని కోరుకున్నారని ఈటల పేర్కొ్న్నారు.

Nayanthara: నయనతారకు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ధర ఎంతో తెలుసా?

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చాడని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు.. ఇవాళ ప్రజల సత్తా చూపారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మేధావులు సహకారం ఇచ్చారని పేర్కొన్నారు. ఉన్నంతలో ధర్మం కాపాడగలిగామని ఈటల చెప్పారు. హుజురాబాద్ లో 2021లోనే కేసీఆర్ డబ్బు సంచులను ఎదుర్కొన్నాం.. నిలబడ్డామన్నారు. ఇప్పుడు కూడా మద్యం, డబ్బులు పంచే పని చేశారన్నారు. హుజురాబాద్ ప్రజలు తన బిడ్డ ఈటల అని గెలిపించబోతున్నారని తెలిపారు. గజ్వేల్ లో తక్కువ కాలంలోనే బాగా పని చేశారు.. కేసీఆర్ ని ఓడించగలవు అని చెప్పారన్నారు. బీజేపీ కార్యకర్తలతో పాటు అనేక మంది నాయకులు పని చేశారని ఈటల తెలిపారు. కేసీఆర్ బాధితులు అంతా తనను ఆదరించారని.. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా పని చేశారని పేర్కొన్నారు.

Tejas Fighter Jets: మరో 97 తేజస్ ఫైటర్ జెట్‌లు.. భారీ రక్షణ ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం

గజ్వేల్ గడ్డ పై బీజేపీ గెలుస్తుందని.. కేసీఆర్ ని ఓడించే సత్తా గజ్వేల్ ప్రజలకే ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. కురుక్షేత్ర యుద్ధంలో సర్వే సంస్థలకు కూడా అంతుబట్టని ఫలితం గజ్వేల్ లో వస్తుందన్నారు. గజ్వేల్ లో గెలుస్తున్నా.. ఎక్కువ మెజారిటీతోనా, తక్కువనో కానీ గెలుస్తున్నా అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. కేసీఆర్ హుజురాబాద్ ప్రజలకు ఒక సైకోని ఇచ్చారని దుయ్యబట్టారు. దానికి కారణం కేసీఆర్ అని విమర్శించారు. తీర్పు వచ్చిన తర్వాత అయినా సమాధానం చెప్పాలని తెలిపారు. కేసీఆర్ నా కొడుకు లాంటి వాడు అన్నాడు.. కేసీఆర్ తీరు ఏందో కూడా రేపు బయట పడుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. 25 నుండి 30 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పారు. సంకీర్ణాల రాజకీయాల్లో ఏమైతదో చూడాలి.. బీఆర్ఎస్ తో కలిసేది లేదని అన్నారు.