Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం తనకు అత్యంత సన్నిహితులైన అస్సాం సీఎం, హైకమిషనర్ హిమంత బిస్వాతో ఈటల భేటీలో జాతీయ నాయకత్వం ఆలోచనలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. అంతకుముందు అమిత్ షా కూడా ఈటల ఫోన్ లో మాట్లాడి ఈ అంశాలను వివరించిన సంగతి తెలిసిందే.
Read also: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..
తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకున్నదని.. పార్టీ శ్రేణులను పూర్తిగా కలుపుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వారిద్దరూ సూచించినట్లు సమాచారం. ఈటల రాజేందర్ మొదట కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. అయితే పార్టీ అగ్రనాయకత్వంతో ఒప్పించి రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
దాదాపు ఇరవై ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కేబినెట్‌లో నంబర్ టూగా గుర్తింపు పొందిన సందర్భంలోనూ, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈటలకి ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్ధవంతమైన నేతగా ఆయనకున్న ఇమేజ్ రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈటలకు గుర్తింపు రావడంతోపాటు వివిధ సామాజికవర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, వర్గాలతో సత్సంబంధాలు ఉండడం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
IND vs PAK: టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!