Site icon NTV Telugu

Etala Rajender: ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం

Etela

Etela

ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. చట్ట సభలపై కేసీఆర్ కి నమ్మకం సన్నగిల్లింది.. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు సమావేశాలు జరిగేవి.. కానీ ఇప్పుడు జస్ట్ 14 రోజుల మాత్రమే జరుగుతున్నాయి.

Read Also: Manoj Tiwary Retirement: 5 రోజుల వ్యవధిలోనే.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న భారత క్రికెటర్!

రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళుగా.. పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్ళుగా మార్చారు ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో నేడు 4 పార్టీలే ఉన్నాయి.. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి.. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారు.. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని బీఏసీ మీటింగ్ కు పిలువలేదు.. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న జయప్రకాష్ నారాయణను కూడా బీఏసీ సమావేశంలో పాల్గొనే వారు అని ఈటల అన్నారు. బీజేపీ సభ్యులకు అసెంబ్లీలో ఒక్క రూమ్ కేటాయించాలని స్పీకర్ ను వేడుకున్నా.. పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

Read Also: CM YS Jagan: మరోసారి ఉదారత చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

తెలంగాణ సమావేశాలు సజావుగా సాగిందని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. స్పీకర్ మా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.. ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం, చట్ట సభల మీద బీఆర్ఎస్ నేతలకు నమ్మకం లేదు అని ఈటల విమర్శించారు. ఈ సభతో బీఆర్ఎస్ కి బై బై చెప్పినట్లేనని అన్నారు.

Read Also: MP Gaurav Gogoi: మణిపుర్‌ అల్లర్లపై ప్రధాని మోడీ మౌనవ్రతం వీడాలి

రాష్ట్రంలో వరదలతో 41 మంది కొట్టుకుపోయారు.. అసెంబ్లీలో కనీసం సంతాపం చెప్పలేదు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వరదలతో చాలా మంది నష్టపోయారు.. కనీసం ప్రభుత్వం సహాయం చేయలేదు.. 109 సీట్లు వస్తాయని అహంకారంతో సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే.. ఒకరోజు హరీష్ రావు.. రెండోరోజూ కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయింది అని ఈటల అన్నారు.

Read Also: Smart Watch Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 89 శాతం తగ్గింపు ఆఫర్.. రూ. 12 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 1299లకే!

కాగ్ రిపోర్ట్ పై ఈటల కామెంట్స్: బడ్జెట్ పెరుగుతుంది… కేటాయింపులు తగ్గుతున్నాయి.. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదు.. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు.. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది.. ప్రభుత్వ ఖర్చులలో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుంది.. నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకే పోతుంది.. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం.. కానీ.. ఈ రోజు భూములు ఎలా అమ్ముతున్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరా వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నారు.. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారు అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Exit mobile version