NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్నదే నా సంక‌ల్పం

Errabelli

Errabelli

జనగామ జిల్లాలోని వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్ తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్నదే నా సంక‌ల్పమన్నారు. వారి కుటుంబాల‌ను వారే సాదుకునే స్థాయికి రావాలని, మ‌హిళ‌లు బాగుప‌డితే దేశం బాగుప‌డుతుందన్నారు. మ‌హిళ‌లు సైనికుల్లా ప‌ని చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎ కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్దశ‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాల‌ను సంద‌ర్శించి, ప‌రిశీలించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స‌ర్టిఫికెట్లు పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి.

Also Read : Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..

తమ ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున రాజకీయాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నట్లు, తన వద్ద డబ్బులు లేనప్పటికీ, పలువురు స్నేహితుల సహకారంతో వినూత్నంగా, విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. పాలకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉచితంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో తొర్రూరు పట్టణానికి చెందిన 150 మందికి ఉచిత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉచిత శిక్షణ ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి హామీ కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ, తాజాగా యువతకు డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ వంటి పలు కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Also Read : Russia-Ukraine War: మాస్కోలో విమానాల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే?