Yash Toxic Teaser: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న కొత్త సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమా టీజర్ రేపు (జనవరి 8) ఉదయం 10:10 గంటలకు రిలీజ్ కానుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు. గీతు మోహన్‌దాస్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. గోవా కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ ‘అడల్ట్స్ ఒన్లీ ఫెయిరీ టేల్’ లో యష్ ఓ డేంజరస్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.
READ ALSO: US-Russia: యూఎస్-రష్యా మధ్య ప్రతిష్టంభన.. ఆయిల్ ట్యాంకర్ సీజ్ చేసిన అమెరికా…
తాజాగా ఈ చిత్రం బృందం విడుదల చేసిన రూలెట్ వీల్ టీజర్ వీడియోలో ఇతర సౌత్ స్టార్స్ పేర్లు స్పిన్ అవుతూ చివరకు ‘రాకింగ్ స్టార్ యష్’ మీద ఆగడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ వీడియోకు గంటల్లోనే వేలాది వ్యూస్, లైక్స్ పడ్డాయి. ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జేజే పెర్రీ యాక్షన్ సీన్స్ డిజైన్ చేయడంతో గ్లోబల్ లెవెల్ యాక్షన్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుందని టాక్. రవి బస్రూర్ మ్యూజిక్, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రంలో నయనతారా, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి గ్లామరస్ బ్యూటీస్ నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై యష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మార్చి 19, 2026న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.
Unveiling tomorrow at 10:10 AM#TOXIC #TOXIConMarch19th#ToxicTheMovie pic.twitter.com/Ij17KvHcfr
— TOXIC (@Toxic_themovie) January 7, 2026
READ ALSO: TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్ షాక్.. రూ.150 కోట్లు ఫైన్!