Jr NTR – Kalyan Ram: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా దేవర. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కథలో భాగంగా తెరకెక్కించబోతున్న సెకండ్ పార్ట్‌లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది. దేవర 2లో బద్ధశత్రువులుగా అన్నదమ్ములు కనిపించనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరో తెలుసా.. జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్.
READ ALSO: Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. నంబర్–3లో బ్యాటింగ్ చేసేది ఎవరంటే?
అవుననండి బాబు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలియదు. ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఈ వార్త నిజం అయితే ఎప్పటి నుంచో వెండి తెరపై నందమూరి అన్నదమ్ములు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్‌లను కలిసి చూడాలని కలలు కంటున్న అభిమానుల కోరిక తీరుతుంది. నిజానికి ఇప్పటికే దేవర 2 కథ ఇప్పటికే లాక్ అయిందని సినీ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే దేవర 2 పట్టాలెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని టాక్. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో పాటు కొరటాల శివ స్నేహితుడికి చెందిన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మించబోతున్నారు.
READ ALSO: Kukatpally Crime: పోలీసులకు చెప్పినా బతకలేదు.. చున్నీతో మొగుడ్ని ఉరేసి చంపిన భార్య