Site icon NTV Telugu

Barabar Premista Controversy: బరాబర్ ప్రేమిస్తా ప్రీ-రిలీజ్ రగడ.. కొడుకు చేసిన తప్పుకు సారీ చెప్పిన తండ్రి..

Barabar Premista Controvers

Barabar Premista Controvers

Barabar Premista Controversy: తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ చిత్ర హీరో చంద్రహాస్.. స్టేజ్‌పై పాడిన పాటలో అసభ్య పదజాలం వాడటంతో పెద్ద రగడ ఏర్పడింది. తాజాగా దీనికి సంబంధించి చంద్రహాస్ తండ్రి ప్రముఖ నటుడు ప్రభాకర్ ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.

READ ALSO: IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!

ఈ వివాదం సినీ పరిశ్రమలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చలకు దారితీసింది. సంపత్ రుద్ర దర్శకత్వంలో యువ నటుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన ‘గుంజి గుంజి’ అనే పాటలో అసభ్య, అనుచిత పదాలు వాడటంతో వివాదం మొదలైంది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రహాస్ పాడిన పాటలోని అసభ్యతపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయని సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై స్పందిస్తూ జేడీ చక్రవర్తి కూడా ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో హీరో చంద్రహాస్‌పై మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా దాఖలైంది.

ఈ నేపథ్యంలో చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ ఓ భావోద్వేగ వీడియోను సామాజిక వేదికల ద్వారా విడుదల చేశారు. ‘నా కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా తప్పు. ఒక చిన్న పొరపాటుతో నా పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించమని అడుగుతున్నాను. ఆరోజు మూవీ ఫంక్షన్ కి వచ్చిన పెద్దలకు కూడా నేను క్షమాపనులు చెప్తున్నాను’ అని ప్రభాకర్ ఈ వీడియోలో పేర్కొన్నారు.

READ ALSO: High Protein Breakfast: తక్కువ టైమ్.. ఎక్కువ ప్రోటీన్.. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ టిఫిన్‌!

Exit mobile version