Ali – Anil Ravipudi: ఆలీ ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి సినిమా.. అడ్వాన్స్ తీసుకున్న స్టార్ డైరెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali – Anil Ravipudi: టాలీవుడ్లో హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ఆలీ. ఇప్పుడు ఆయన నిర్మాతగా ‘హిట్ మిషన్’ అనిల్ రావిపూడి హీరోగా ఒక సినిమా ఎక్కబోతుంది. ఈ రోజు జరిగిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆలీ.. అనిల్ రావిపూడికి అడ్వాన్స్ ఇచ్చాడు. అనంతరం ఈ ఈవెంట్లో ఆలీ మాట్లాడుతూ.. సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Male vs Female Capsicum: క్యాప్సికమ్‌లో ఆడ, మగ ఉంటాయా? ఉంటే ఏది వంటకు.. ఏది సలాడ్‌కు?
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. సాధారణంగా అనిల్ రావిపూడిని మనం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గానే చూస్తాం. కానీ ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నటుడు, డ్యాన్సర్, కమెడియన్ కూడా అని చెప్పారు. “అనిల్ రావిపూడి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకు కూడా తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలో స్వయంగా చేసి చూపిస్తారు. ఆయనలో ఒక మంచి నటుడు ఉన్నాడు” అని ఆలీ కొనియాడారు. అనిల్ రావిపూడి తన కెరీర్ స్టార్టింగ్‌లో రైటర్‌గా ఫస్ట్ సీన్ రాసింది తన కోసమే అని చెప్పారు. నాగార్జున హీరోగా వచ్చిన ‘బాస్’ సినిమాలో తన కామెడీ ట్రాక్ తోనే అనిల్ సినీ ఇండస్ట్రీలో కలం పట్టారని, ఆ ‘బాస్’ నుంచి నేటి ‘బిగ్ బాస్’ మెగాస్టార్ చిరంజీవితో సినిమారేంజ్ వరకు ఎదిగిన అనిల్ టాలెంట్ గొప్పదని ప్రశంసించారు. అందుకే చిరంజీవి గారు కూడా ఆయన టాలెంట్ చూసి పిలిచి మరీ సినిమా చేసే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.
అనిల్ రావిపూడి గనుక హీరోగా చేస్తే, తానే స్వయంగా నిర్మాతగా ఉంటానని ఆలీ స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆలీని అడ్వాన్స్ అడిగి తీసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తాను హీరోగా చేయనని, కచ్చితంగా ఆలీగారికి ఎప్పుడు కూదిరితే అప్పుడు డైరెక్టర్‌గా సినిమా చెస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫిబ్రవరి 12న ETV Winలో ప్రీమియర్ అవుతుంది. ఈ సినిమాలో ఆలీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో హీరోగా శివాజీ, హీరోయిన్గా లయ కనిపించనున్నారు.
READ ALSO: Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
తాజావార్తలు
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!