పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్:పార్ట్-1 సీజ్‍ఫైర్ ‘. గత ఏడాది డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి దాదాపు రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఎంతాగానో నచ్చేసాయి.. ఇదిలా ఉంటే సలార్ చిత్రం ఓటీటీలో కూడా అదే రేంజ్‍లో దుమ్మురేపుతోంది. సలార్ సినిమా నెట్‍ఫ్లిక్స్ లో జనవరి 20వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకెళ్లింది. చాలారోజులు ఇండియాలో టాప్ ట్రెండింగ్‍లో కొనసాగింది. గ్లోబల్‍గానూ చాలా దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది.
కాగా, ఇప్పుడు సలార్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.సలార్ ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ నేడు (ఫిబ్రవరి 5) అందుబాటులోకి తెచ్చింది. “భారీ డిమాండ్ల మేరకు.. గ్లోబల్ ఆడియన్స్ కోసం యాక్షన్ ఎపిక్ సలార్ ఇంగ్లిష్ వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.సలార్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్‍లోకి రాకముందే గ్లోబల్ రేంజ్‍లో దుమ్మురేపింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్‌తో చాలా దేశాల్లోని ప్రజలు ఈ మూవీని చూశారు. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.. దీంతో సలార్ గోస్ గ్లోబల్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆ తర్వాత సలార్ ఇంగ్లిష్ వెర్షన్ త్వరగా తీసుకురావాలని చాలా మంది డిమాండ్లు చేశారు.అయితే ఎట్టకేలకు ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ తీసుకురావటంతో గ్లోబల్ రేంజ్‍లో సలార్ మరింత దుమ్మురేపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Final voting begins. 🙌
Salaar is now available in English, Telugu, Tamil, Malayalam and Kannada on Netflix! #SalaarOnNetflix pic.twitter.com/8gQpRWNmum— Netflix India South (@Netflix_INSouth) February 5, 2024