NTV Telugu Site icon

IND vs ENG : చితక్కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం

Ind End

Ind End

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం బారాబతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. కటక్‌లో జరుగుతున్న రెండో ఓడీఐలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఓడీఐలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) ఆఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో లివింగ్‌స్టన్ 32 బంతుల్లో 41 పరుగులు తీశాడు. దీంతో ఇంగ్లండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరోవైపు భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/35) అద్భుతమైన స్పెల్ వేశాడు. వరుణ్ చక్రవర్తి, షమి హర్షిత్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు. కాగా.. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.