NTV Telugu Site icon

Liam Livingstone: RCB ‘హీరో’నే తీసుకుంది… 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్

Liam Livingstone

Liam Livingstone

అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ వీర విహారం చేశాడు. 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ. 8.75 కోట్లకు దక్కించుకున్న ఒక రోజు తర్వాత.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా.. లివింగ్‌స్టోన్ అజేయంగా 50 పరుగులతో ఢిల్లీ బుల్స్‌పై బంగ్లా టైగర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 123 పరుగుల లక్ష్యాన్ని టైగర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మెన్‌ జేమ్స్‌ విన్స్‌ 15 బంతుల్లో 27 పరుగులు చేసి బుల్స్‌ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు.

Mallikarjun Kharge: ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ పేపర్లు కావాలి.. ఖర్గే డిమాండ్..

లివింగ్‌స్టోన్ హార్డ్-హిట్టింగ్‌ చేయగల సత్తా ఉన్నవాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లండ్ వైట్-బాల్ జట్టులో ముఖ్యమైన ప్లేయర్‌గా ఉన్నాడు. లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో 162.45 స్ట్రైక్ రేట్‌తో 939 పరుగులు చేయడంతో క్యాష్ రిచ్ లీగ్‌లో తన సత్తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో ఆరు అర్ధ సెంచరీలు చేసిన అతను ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.

Honda Activa EV: రేపు ఇండియాలో గ్రాండ్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు

లివింగ్‌స్టన్ టీ20 స్పెషలిస్ట్.. అతను బిగ్ బాష్, SA20, ఐపీఎల్ వంటి లీగ్‌లలో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022లో అతడిని రూ.11.50 కోట్ల భారీ మొత్తానికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతను గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 182.08 స్ట్రైక్ రేట్‌తో 437 పరుగులు చేశాడు. అయినప్పటికీ, పంజాబ్ కింగ్స్ అతనిని రిటైన్ చేసుకోలేదు. తాజాగా.. జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ లియామ్ లివింగ్‌స్టన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది.