Site icon NTV Telugu

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?

Ed

Ed

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి విచారణ అనంతరం అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ అంశాలకు సంబంధించిన దర్యాప్తునకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆయనకు భద్రతను ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఈడీ కేజ్రీవాల్ ను అరెస్టు జరిగింది. అయితే, ఈ కేసులో మార్చి 15వ తేదీన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్టు చేయగా.. ఇప్పుడు ఈ కేసులో నాలుగో హై ప్రొఫైల్ అరెస్ట్ జరిగింది. PMLA సెక్షన్ 3, సెక్షన్ 4 కింద మనీలాండరింగ్ ఆరోపణలపై దాదాపు 18 నెలల్లోనే 16 మంది నాయకులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

Read Also: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ కొత్త షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?

అయితే, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొదటి అరెస్టు 2022 సెప్టెంబర్ 28న సమీర్ మహేంద్రుడిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక, మహేంద్రు రెండు చెల్లింపులు చేసినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. వీరిలో మొదటి చెల్లింపుగా 1 కోటి రూపాయలను అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరాకు ఇవ్వగా.. రెండో చెల్లింపుగా గురుగ్రామ్‌కు చెందిన మధ్యవర్తి అర్జున్‌కు రూ.2 నుంచి 4 కోట్లు ఇచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొనింది. అలాగే, విజయ్ నాయర్ ఆదేశాల మేరకు డబ్బును రికవరీ చేసినట్లు ఈడీ ఆరోపిస్తుంది.

Read Also: Crying Rooms: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్లు.. వారి కోసం ప్రత్యేకం..!

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోరాలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులు 2022లో జరిగాయి. వీరితో పాటు 2023లో గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, రాఘవ్ మాగుంట, అమన్ ధాల్, అరుణ్ పిళ్లై, మనీష్ సిసోడియా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఇక, 2024లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Exit mobile version