మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు..రవితేజ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి.ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ఉన్న రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.తాజా సమాచారం మిస్టర్ బచ్చన్ కొత్త షెడ్యూల్ లక్నోలో షురూ అయింది. త్వరలోనే రవితేజ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడని సమాచారం.. లక్నోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.. అలాగే ఈ షెడ్యూల్ తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని సమాచారం.. రవితేజ ఇప్పటికే షూటింగ్ నుంచి విరామం తీసుకొని ఫ్యామిలీ వెకేషన్ కోసం యూఎస్ వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు.ఈ మూవీ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.తాజా సినిమాకు మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ‘మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయింది. రవితేజ కథానుగుణంగా అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపిస్తారని సమాచారం.ఈ చిత్రానికి ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వర్క్ చేస్తున్నారు.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, T సిరీస్ మరియు పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.