తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read:Exclusive : ఘట్టమనేని జయకృష్ణ – అజయ్ భూపతి టైటిల్ ఇదే
సురేష్ బాబు పర్యవేక్షణలో, 35 నిర్మించిన సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు S ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మాణం చేపట్టనున్నట్లు మొదట్లో ప్రకటించారు.
అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బడ్జెట్ పరిమితుల కారణంగా సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ENE రిపీట్’ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.
Also Read:RGV-Chiranjeevi: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. నెటిజన్స్ షాక్!
ఈ పరిణామాల నేపథ్యంలో, సురేష్ బాబు లేకుండానే ముందుకు సాగాలని సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో, విశ్వక్ సేన్ తన ఇతర కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యమైంది.ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమాను పూర్తి చేసిన తర్వాత, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ‘ఈNఈ రిపీట్’ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం కారణంగా, ఈ సీక్వెల్ ‘ఈNఈ రిపీట్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
