ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ట్రస్టు వ్యవహారంపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు విచారణ దశలో ఉంది. అయితే.. ఎలాంటి తదుపరి చర్యలూ వద్దంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే.. న్యాయస్థానంలో ఈనెల 29న కేసు విచారణకు రావాల్సి ఉండగా.. ఈలోగా మరోసారి సెక్షన్ 43 కింద నోటీసులు జారీ చేసింది దేవదాయశాఖ.
ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమంటే.. న్యాయ ఉల్లంఘనే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మే 30వ తేదీతో రూపొందించిన ఈ నోటీసులు ట్రస్టుకు ఆలస్యంగా అందినట్లు తెలుస్తోంది.