NTV Telugu Site icon

Malladi Vishnu: బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్

Malladi Vishnu

Malladi Vishnu

Malladi Vishnu: వైసీపీ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్‌ టికెట్‌ కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మెత్తబడినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు పాటించాలని నిర్ణయానికి మల్లాది విష్ణు వచ్చారు. వెల్లంపల్లికి వచ్చే ఎన్నికల్లో సహకరించాలని తన వర్గానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంకేతాలు ఇచ్చారు. అధికారికంగా రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఇస్తామని విష్ణుకి అధిష్ఠానం హామీ ఇచ్చింది. 2 రోజుల్లో బెజవాడ సెంట్రల్ ఇంఛార్జి వెలంపల్లి శ్రీనివాస్ పార్టీ ఆఫీసును సెంట్రల్‌లో ఓపెన్ చేయనున్నట్లు సమాచారం.

Read Also: Kakinada YCP Politics: ఇంకా కొలిక్కిరాని వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి కసరత్తు

ఇదిలా ఉండగా.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ మా మేనిఫెస్టోలో అంశాలనే ఫాలో అవుతున్నారని విమర్శించారు. 2014లో కలిసి పోటీ చేసి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కర్నూలు హైకోర్టు బెంచ్, విశాఖ వ్యాపార రాజధాని, అమరావతి అంటూ మా విధానాన్నే ఫాలో అయ్యారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వైసీపీ సరైన నిర్ణయాలే తీసుకుంటోందన్నారు. సీట్ల సర్దుబాటు దగ్గరే టీడీపీ, జనసేన ఆగిపోయాయన్నారు. మేం ఏ విధంగా ఎన్నికలలో పనిచేయాలో ప్రణాళికలు కూడా చేసేశామని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ సీటు విషయంలో తరువాత మాట్లాడుతానని ఆయన అన్నారు.

వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీట్ వివాదానికి ఎండ్ కార్డ్ | Malladi Vishnu | Vellampalli Srinivas | Ntv