ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇవాళ ( బుధవారం ) ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీపురు భట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు, మావోయిస్టులు ఎదురు పడటంతో ఎదురు కాల్పుల్లో జరగ్గా.. ఇప్పటి వరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా 6 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒక మహిళా నక్సలైట్ మృతదేహం కూడా ఉంది.
Read Also: Kid Climb Mount Everest: బుడిబుడి అడుగులతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి..!
ఇక, అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. సంఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలను కూడా రికవరి చేసుకున్నారు. వాటిని సీజ్ చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా CRPF అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే, నక్సలైట్లు హోలీ రోజున ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.