NTV Telugu Site icon

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి

Encounter

Encounter

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లా మట్ బేడ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు. ఈ విషయాన్ని నారాయణపూర్ పోలీసులు ధృవీకరించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఓర్చా అడవుల్లో నక్సలైట్లు ఉన్నారని సోమవారం ఉదయం భద్రతా బలగాలకు సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. దీంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) మరియు బస్తర్ ఫైటర్స్, పోలీసు రెండు యూనిట్ల సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

Read Also: Csk Released Ben Stokes: మాకు నీవొద్దు స్టోక్స్ బాబాయ్.. ప్యాట్ కమిన్స్ పై కన్ను..!

ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు ఆయుధాలు, మావోయిస్టు వాడే సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కికలేరు మార్గ మధ్యంలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని అమర్చిన 15 కేజీల మందు పాతరను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. అయితే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నక్సలైట్ ఎవరనేది తెలియాల్సి ఉంది. సమీప ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు.