NTV Telugu Site icon

Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టుల హతం

New Project (17)

New Project (17)

Encounter: జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరుగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఖాకీల రాకను పసిగట్టిన నక్సల్స్‌ కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.

Read Also: Delhi CM Kejriwal : ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ.. రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

నక్సలైట్లకు సహకరించిన ఇతర వ్యక్తుల ఆచూకీ కోసం అడవిలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు రెండు ఏకే-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అడవిలో మరికొన్ని ఆయుధాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరికొందరు నక్సలైట్లకు కూడా బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం. 25 లక్షల రివార్డుతో స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ తన స్క్వాడ్‌తో ఎన్ కౌంటర్ స్థలంలో ఉన్నాడని సమాచారం. మరో ఇద్దరు నక్సలైట్లపై రూ.5 లక్షల రివార్డు ఉంది. గత కొంత కాలంగా జార్ఖండ్‌ లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు.

Read Also: Twitter Blue Tick: మస్క్‌ కీలక నిర్ణయం.. వారికి ఫ్రీగా ట్విట్టర్‌ బ్లూటిక్‌.. వీరికి మాత్రం షాక్..!

Show comments