NTV Telugu Site icon

Andhra Pradesh: జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఏపీలో జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తెచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. సీపీఎస్ ఉద్యోగులతో పాటు అందరూ దానిని వ్యతిరేకించారన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా జీపీఎస్ విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోను కొంతమంది అధికారులు అమల్లో తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. పాత ప్రభుత్వం తాలూకా వాసన ఇంకా అధికారులకు పోయినట్లు లేదన్నారు. జీపీఎస్ జీవో, గెజిట్ బయటికి రావడంపై మంది ఉద్యోగులు ఆందోళన చెందారు. జీవో నిలుపుదల ఆదేశాలతో ఉద్యోగులకు చంద్రబాబు ఊరటనిచ్చారు.

Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు

Show comments