Kangana Ranaut: నటిగా ఉండడం ఇష్టం లేదు: కంగనా
- సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీ విడుదల
- ఆఫర్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా
- విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut I Love Direction: నటిగానే కొనసాగడం తనకు నచ్చదు అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పారు. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో తానూ ఒకరినన్నారు. దర్శకురాలిగా ఉండటం ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ సమయంలో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అని కంగనా తెలిపారు. కంగనా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి చెప్పారు.
‘నటిని కావాలనే ఆశతో 2004లో ముంబైకి వచ్చా. ఆరంభంలో గ్యాంగ్‌స్టర్, వోహ లమ్హే వంటి చిత్రాల్లో నటించాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రలు చేశాను. నా నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అయితే దాదాపు దశాబ్దకాలం పాటు నాకు అవకాశాలు రాలేదు. ఆఫర్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నా’ అని కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కంగనా రనౌత్ చెప్పారు.
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
Also Read: Mathu Vadalara 2 Teaser: వెల్‌కమ్ టు ‘హీ’ టీమ్.. ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ టీజర్!
నటిగా కంటే దర్శకురాలిగానే తనకు వర్క్ చేయడం బాగుంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కంగనా సమాధానం ఇచ్చారు. ‘నటిగా వర్క్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. నటిగానే కొనసాగడం నాకు నచ్చదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఓ నటిగా చెప్పాలంటే.. సెట్‌కు సంబంధించి పూర్తి సమాచారం మన వద్ద ఉండదు. దర్శకురాలిగా ఉండటం ఇష్టం. సెట్‌లో ఏం జరుగుతుంది? అన్నది నేను చెప్పగలను. నాకు పూర్తి అవగాహన ఉంటుంది. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో నేనూ ఒకరిని అనుకుంటున్నా. సెట్స్‌లో నాకు నటీనటులంటే చాలా గౌరవం. వారిని ఏంతో జాగ్రత్తగా చూసుకుంటా’ అని బాలీవుడ్ క్వీన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!