Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!
- ఏలూరు జిల్లాలో విషాదం
- తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి
- కొంత కుళ్లిన స్థితిలో మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం నల్లమడు సమీపంలోని జీడి మామిడి తోటల్లో తల్లి, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. మృతులను అనంతపల్లి కొత్తపేటకు చెందిన వడ్డే వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరలక్ష్మి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. తల్లి వెంకటలక్ష్మి సహాయంతో రోజువారీ విధులు నిర్వహించేవారు. తల్లి, కూతురు ఇద్దరూ శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో నల్లమడు సమీపంలోని జీడి మామిడి తోటలో ఇద్దరి మృతదేహాలు గుర్తించబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు కొంత కుళ్లిన స్థితిలో ఉండటంతో వారు మరణించి కొన్ని రోజులు గడిచినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Also Read
ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తల్లి, కూతురిని ఎక్కడైనా హత్య చేసి అనంతరం తోటలో పడేశారా? లేదా అదే ప్రాంతంలో హత్య జరిగిందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు