Eluru: ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీల్లో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్ రాని నేతలు.. పార్టీపై తిరుగు బాటు ఎగుర వేస్తున్నారు. నాలుగు నెలల క్రితం బస్సు యాత్రలో భాగంగా తన ఇంటికి వచ్చి మేమంతా మీతోనే ఉన్నాం మీరే మా ఎంపీ అభ్యర్థి బాబు.. అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. పార్టీ ఇచ్చిన హామీని.. ఇప్పుడు కాదంటున్నారు. యనమల రామకృష్ణుడు తన అల్లుడిని ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎలా తీసుకువచ్చారని మాగంటి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Read Also: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్‌ను చూశారా?
తనతో ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థిత్వం మార్చడం బాధాకరమని మాగంటి అంటున్నట్లుగా సమాచారం. మాగంటి వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, తనకు అత్యంత ఆప్తుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై మాగంటి బాబు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మాగంటి యాక్టీవ్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల మాగంటి బాబు తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా… ఏలూరు ఎంపీ అవమానకరంగా భావిస్తున్నారని సమాచారం. కాగా, పొత్తులో భాగంగా టీడీపీ.. జనసేన, బీజేపీకి కేటాయించిన మరికొన్ని స్థానాల్లో కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.. మరోవైపు.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ.. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట..