NTV Telugu Site icon

Reddy Appalanaidu: ఏలూరు జనసేన ఇంచార్జ్‌ అసంతృప్తి.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు

Reddy Appalanaidu

Reddy Appalanaidu

Reddy Appalanaidu: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత.. రెండు పార్టీల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.. సీటు దక్కని నేతలు.. పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇంతకాలం టికెట్‌కోసం వేచిచూసిన నేతలు.. కన్నీరుమున్నీరవుతున్నారు.. ఇక, భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించుకుని కార్యాచరణ రూపొందించుకుంటామని ఏలూరు జనసేన ఇంచార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. 2019 కంటే బలపడిన జనసేన పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడం, పవర్ షేరింగ్ లేకపోవడం వల్ల జన సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాయా ? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు ఏలూరు జనసేన ఇంఛార్జ్‌ అప్పలనాయుడు.

Read Also: Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 22వేలకు పడిపోయిన నిఫ్టీ

ఇక, జనసేన తరఫున పోటీ చేయబోయే 24 మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు.. గెలిచినవారు పార్టీలో ఉంటారో లేదో అనుమానమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పలనాయుడు.. భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా? లేదా అనే విషయాన్ని భట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామన్న ఆయన.. అధికారంలో షేర్ లేకుండా తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపించట్లేదనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన దానికి భిన్నంగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. ఎక్కువ సీట్లు తీసుకోకపోవడం పార్టీ అభివృద్ధికి ఆటంకంగా పేర్కొన్నారు. అయితే, ఏలూరు అసెంబ్లీ సీటు దక్కకపోవడం అసంతృప్తికి గురిచేసింది.. ఏలూరులో జనసేన కచ్చితంగా గెలిచేది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏలూరు జనసేన ఇంఛార్జ్‌ అప్పలనాయుడు.