Reddy Appalanaidu: ఏలూరు జనసేన ఇంచార్జ్ అసంతృప్తి.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reddy Appalanaidu: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత.. రెండు పార్టీల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.. సీటు దక్కని నేతలు.. పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇంతకాలం టికెట్‌కోసం వేచిచూసిన నేతలు.. కన్నీరుమున్నీరవుతున్నారు.. ఇక, భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించుకుని కార్యాచరణ రూపొందించుకుంటామని ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. 2019 కంటే బలపడిన జనసేన పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడం, పవర్ షేరింగ్ లేకపోవడం వల్ల జన సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయా ? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు ఏలూరు జనసేన ఇంఛార్జ్ అప్పలనాయుడు.
Read Also: Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 22వేలకు పడిపోయిన నిఫ్టీ
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ఇక, జనసేన తరఫున పోటీ చేయబోయే 24 మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు.. గెలిచినవారు పార్టీలో ఉంటారో లేదో అనుమానమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పలనాయుడు.. భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా? లేదా అనే విషయాన్ని భట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామన్న ఆయన.. అధికారంలో షేర్ లేకుండా తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపించట్లేదనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన దానికి భిన్నంగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. ఎక్కువ సీట్లు తీసుకోకపోవడం పార్టీ అభివృద్ధికి ఆటంకంగా పేర్కొన్నారు. అయితే, ఏలూరు అసెంబ్లీ సీటు దక్కకపోవడం అసంతృప్తికి గురిచేసింది.. ఏలూరులో జనసేన కచ్చితంగా గెలిచేది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏలూరు జనసేన ఇంఛార్జ్ అప్పలనాయుడు.
తాజావార్తలు
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్‌ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!