Site icon NTV Telugu

Elon Musk: ప్రపంచ దేశాల్లో జనాభా తగ్గుతుంది.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి..

Elon

Elon

Elon Musk: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ధనిక దేశాలైన అమెరికా, జపాన్, ఇటలీలో జననాల సంఖ్య తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. దానిని నివారించాలంటే సంతానం కనగలిగే మహిళలు కనీసం ముగ్గురు పిల్లలకి జన్మను ఇవ్వాలని సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు ఎలాన్ మస్క్.

Read Also: Baba Ramdev: సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదు.. ఒక విజనరీ

ఇక, ప్రపంచ దేశాల్లో తగ్గిపోతున్న జనాభా స్థాయిలను పెంచడానికి మహిళలు సగటున అధికంగా పిల్లలను కనాలని ఎలాన్‌ మస్క్‌ కోరారు. ఈ సందర్భంగా ఫార్చ్యూన్ నివేదికను బయట పెట్టారు. అమెరికా లాంటి దేశాల్లో జననాల రేటు తగ్గిపోతుండటం వల్ల వారి నాగరికత పతనమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తన మాటలను ఒకవేళ నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని వెల్లడించారు. కాగా, ప్రస్తుత ప్రపంచ సంతానోత్పత్తి రేట్లు 1963లో సగటున ప్రతి స్త్రీకి 5.3 మంది పిల్లల నుంచి ఈరోజు 2.5 కంటే తక్కువకు నాటకీయంగా పడిపోయిందన్నారు.

Exit mobile version