NTV Telugu Site icon

Elon Musk: అమెరికా రాజకీయాలపై ట్వీట్‌ చేసిన మస్క్‌.. ఏమన్నారంటే?

Elon Musk

Elon Musk

Elon Musk: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటు వేయాలని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ప్రజలను కోరారు. ఆయన రిపబ్లికన్ కాంగ్రెస్‌ను ఎందుకు కోరుకుంటున్నారో వివరిస్తూ.. రెండు రాజకీయ పార్టీలు అధికారంలో ఉండటం ఉత్తమమని, డెమోక్రాట్‌లు ఇప్పటికే అధ్యక్ష పదవి కలిగి ఉన్నారని.. కావున మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేయాలని ట్విట్టర్‌ యూజర్లకు సూచించారు. భాగస్వామ్య అధికారం రెండు పార్టీల చెత్త మితిమీరిన చర్యలను అరికడుతుందన్నారు. రెండు పార్టీలకు అవకాశం కల్పించడం వల్ల అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. అందువల్ల మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ కాంగ్రెస్ ఓటేయాలని సూచిస్తున్నట్లు ఎలన్ మస్క్‌ ట్వీట్‌ చేశారు.

టెస్లా యజమాని ఎలన్‌ మస్క్‌ అమెరికా రాజకీయాలపై ట్వీట్‌ చేయడం ఇదే మొదటిసారి. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసి, భారీ మార్పులు తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ కుబేర వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా రాజకీయాలపై దృష్టి సారించారు. మొట్టమొదటి సారిగా రాజకీయాలకు సంబంధించిన ట్వీట్ చేశారు. అందులో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతు ఇవ్వాలని ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమెరికన్లను కోరారు. ఆయన ట్వీట్‌పై సోషల్ మీడియాలో యూజర్లు స్పందిస్తున్నారు.

BJP MP Janardhan Mishra: మద్యం సేవించండి, గుట్కా తినండి.. నీటి సంరక్షణపై బీజేపీ ఎంపీ చిట్కాలు

అందులో ఆయన కఠినమైన డెమోక్రాట్లు లేదా రిపబ్లికన్లు ఎప్పుడూ ఇతర వైపునకు ఓటు వేయరని అన్నారు. కాబట్టి స్వతంత్ర ఓటర్లు నిజంగా ఎవరు బాధ్యత వహించాలో నిర్ణయిస్తారని ఎలన్ మస్క్ అన్నారు. మధ్యంతర ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఈరోజు చివరిసారిగా ప్రచారం నిర్వహించారు. బైడెన్ అధ్యక్ష పదవిని ప్రభావితం చేసే ఈ ఎన్నికలు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య మద్దతును అణగదొక్కే అవకాశం కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తిరిగి వచ్చే ప్రయత్నానికి కూడా మార్గం తెరవొచ్చు. ప్రారంభ ఓటింగ్ ఎంపికల ద్వారా 40 మిలియన్లకు పైగా బ్యాలెట్‌లు వేశారు. అంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాను పాలించేది ఎవరన్నది ఇప్పటికే నిర్ణయించబడింది. దేశవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యే పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

కరోనా వ్యాప్తి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న కీలక సమయంలో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంలో పెరుగుదల వంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రజాదరణ క్రమంగా క్షీణిస్తోంది. అధికారులతో తన గొడవల మధ్య, డొనాల్డ్ ట్రంప్ కూడా రాజకీయాల్లోకి తిరిగి రావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.