Site icon NTV Telugu

Elon Musk: నాకు ఏ బాధ్యతలు వద్దు.. త్వరలోనే వెళ్లిపోతా

Elon Musk

Elon Musk

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు.. తాను చాలా బిజీగా ఉంటానని.. ఏ కంపెనీకి సీఈవోగా వ్యవహరించలేనంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే 44బిలియన్ డాలర్లకు ట్విటర్ సంస్థను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ పూర్తి బాధ్యతలను దగ్గరుండి ఆయనే చూసుకుంటున్నారు. త్వరలోనే ట్విట్టర్ కు కొత్త సీఈవోను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను తాత్కాలిక సీఈవోగానే ఉన్నానన్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన వాహనాల తయారీ సంస్థ టెస్లా, రెండో అతిపెద్ద రక్షణ కాంట్రాక్టర్ స్పెస్ ఎక్స్, ట్విటర్ సీఈవో హోదాలో డాలావర్ కోర్టుకు హాజరయ్యారు. టెస్లా సంస్థకు సంబంధించి సీఈవోగా ఉన్నందుకు ఎలన్ మస్క్‌కు ఆ సంస్థ 2018లో 56 బిలియన్ డాలర్లు ప్యాకేజీగా చెల్లించింది. దీన్ని సవాలు చేస్తూ ఈ కంపెనీలో షేర్ హోల్డర్ అయిన రిచర్డ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఎలన్ మస్క్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Bank strike : డబ్బు కావాలంటే త్వరపడండి.. ఆ రోజు బ్యాంకులు పనిచేయవు

తాను సీఈవోగా కొన్ని బాధ్యతలకే పరిమితం కాలేదని, కంపెనీని విజయపథంలో నడిపించేందుకు అనేక రకాలుగా కృషి చేశానని, అందువల్లే కంపెనీ తనకు అంతమొత్తంలో చెల్లించిందని మస్క్ కోర్టుకు తెలిపాడు. అలాగే ట్విట్టర్ సీఈవోగా కొనసాగడంపై కూడా స్పందించాడు. ‘‘ట్విట్టర్ సంస్థను పూర్తి విజయపథంలో నిలిపేంతవరకు కంపెనీ సీఈవోగా కొనసాగుతాను. ఆ తర్వాత వేరే వాళ్లను నియమిస్తాను. నాకు సీఈవోగా కొనసాగాలని అంతగా ఆసక్తి లేదు. ఈ విషయంలో నాకు టెస్లా ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు’’ అని మస్క్ కోర్టులో తెలిపాడు. మరోవైపు ట్విట్టర్ లో మస్క్ తీసుకొస్తున్న మార్పులు అనేక సంచలనాలకు కారణమవుతున్నాయి. ఉద్యోగుల్ని భారీ స్థాయిలో తొలగించడంతోపాటు, బ్లూటిక్ సర్వీస్‌కు డబ్బులు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: Michelle Obama: అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిచెల్ ఒబామా

Exit mobile version