Twitter layoff: మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో మరోసారి ఉద్యోగాల కోత ఉండబోతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల్ని తొలగించగా..మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొదట 7,500 మంది ఉద్యోగులు ఉండగా సగానికిపైగా మందిని తొలగించారు. ఈసారి ఈ సంఖ్యను 2000 దిగువకు కుదించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అధికారులకు మస్క్ ఆదేశాలు జారీ చేశారట. మరో వారం, 10 రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also: BJP Resolution: ప్రధాని ఆధ్వర్యంలో ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా భారత్.. బీజేపీ తీర్మానం
వేలానికి ట్విట్టర్ ఆఫీస్ సామాన్లు
మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ కష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ ఆఫీసులకు అద్దె కట్టలేని పరిస్థితులకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని కాఫీ మిషన్లు, నియాన్ లోగో, ఇతర సామగ్రిని వేలానికి పెట్టారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. దీనికి సంబంధించి హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ సంస్థ 27 గంటల ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 631 సర్‌ప్లస్ కార్పొరేట్ ఆఫీస్ ఆస్తులు ఉంచారు. ఇండస్ట్రీయల్ కిచెన్ వేర్, వైట్‌బోర్డులు, డెస్కుల వంటి ఆఫీస్ ఫర్నీచర్, కేఎన్95 మాస్కులు కలిగిన 100కుపైగా బాక్సులు, డిజైనర్ కుర్చీలు, కాఫీ మిషన్లు వంటివి వేలం వేసింది.