Site icon NTV Telugu

Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం దారుణం..

Elon Musk

Elon Musk

United Nations: ఐక్యరాజ్యసమితి పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ మాస్క్ విమర్శలు గుప్పించారు. అయితే, యూఎన్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేస్తూ.. భద్రతా మండలిలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 80 ఏళ్ల కిందటిలా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ స్టార్ట్ అయింది.

Read Also: Ayodhya Ram: రామ్ లల్లా విగ్రహానికి 11 కోట్ల విలువైన కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన గుజరాత్ వజ్రాల వ్యాపారి..

అలాగే, అమెరికాకు చెందిన వ్యాపారి మైఖెల్ ఐసెస్ బర్డ్ ఈ పోస్ట్ కు సమాధానం ఇస్తూ.. మరి భారత్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్ మాస్క్ రియాక్ట్ అవుతూ.. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదిలి పెట్టేందుకు ముందుకు రాకపోవడం వల్లే అసలు సమస్య వస్తుందన్నాడు.. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ చెప్పుకొచ్చాడు.

Read Also: Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం

ఇక, ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ జరగలేదు.. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నిస్తున్నప్పటికి.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు.. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నాప్పటికి.. ఒక్క చైనా మాత్రం భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు అడ్డు తగులుతుంది.

Exit mobile version