Site icon NTV Telugu

Elon Musk: అలా జరుగుతోంది.. కాబట్టే ఇలా ఉద్యోగులను తీస్తేస్తున్నాను

Twitter Elon Musk

Twitter Elon Musk

Elon Musk: ఉద్యోగుల తొలగింపుపై ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. కంపెనీ రోజుకు 4మిలయన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున వేరే అవకాశంలేకనే ఇలా చేయాల్సి వస్తోందని తెలిపారు. అందుకే పనితీరు బాగాలేని ఉద్యోగుల ఏరివేతను కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీసేసిన ఉద్యోగులందరికీ మూడు నెలల వేతనాలను చెల్లిస్తామన్నారు. ఇది చట్టపరంగా 50శాతం కంటే ఎక్కువని మస్క్ చెప్పారు. అక్టోబర్ 27న ట్విటర్‌ను ఎలాన్ మస్క్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. నవంబర్ 4న కంపెనీ ఉద్యోగులను 3,700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. తొలగించే క్రమంలో ఉద్యోగులకు రావాల్సిన డబ్బులను జనవరి, ఫిబ్రవరి నాటికి చట్టబద్దంగా చెల్లిస్తామని చెప్పారు.

Read Also: WhatsApp New Feature : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. ఫోటో బ్లర్ చేసుకునే ఆప్షన్

ఇప్పటికే కొత్త యాజమాన్యంలో ఇమడలేమనుకుని చాలామంది ఉద్యోగులు తప్పుకున్నారు. గత వారం ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మరికొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను మస్క్ తొలగించారు. ఈ తొలగింపు భారత్‌ టీంపై ఎక్కువ ఎఫెక్ట్ పడిందని సమాచారం. అయితే దీనిపై ట్విట్టర్ ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఉద్యోగులను కూడా తొలగిస్తారని… ట్విట్టర్ ఇండియా ఉద్యోగి ఒకరు చెప్పారు. తన సహచరులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే మెయిల్స్ సమాచారం అందుకున్నారని వివరించారు. ఇప్పటికి 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని కంపెనీ తొలగించింది. మీడియా నివేదికల ప్రకారం, సుమారు 50 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

Read Also: S. S.Rajamouli: ఓటీటీలో దూసుకుపోతున్న బ్రహ్మాస్త్ర.. ఫలించిన జక్కన్న స్ట్రాటజీ

Exit mobile version