Site icon NTV Telugu

Ellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరంటే ?

Yellamma

Yellamma

‘బలగం’ సినిమాతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు వేణు ఎల్దండి, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథాంశం మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) ను హీరోగా పరిచయం చేస్తున్నారు వేణు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఎల్లమ్మ దేవత చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ సినిమా కోసం వేణు ఏకంగా 8 గంటల పాటు కథను వివరించగా, అందులోని ఇంటెన్సిటీ నచ్చి డిఎస్పీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజాగా విడుదలైన చిన్న టీజర్ గమనిస్తే, ఇందులో డిఎస్పీ ‘పర్శి’ అనే మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టేలా కనిపిస్తున్నారు.

Also Read : AR Rahman: తండ్రి కోసం రంగంలోకి అమీన్.. మోదీ ప్రశంసించిన వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్!

ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే, ఇందులో రెగ్యులర్ హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరట. కథ మొత్తం అమ్మవారి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. కానీ ఆ ‘ఎల్లమ్మ’ దేవత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ దేవతగా కనిపిస్తే, ఆమె భక్తుడిగా దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్‌తో చర్చలు జరుగుతున్నాయి, ఆమె ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ సెంటిమెంట్‌ను మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి వేణు ఈ సినిమాను ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version