Elephant Tension : కొమురం భీం జిల్లా వాసులను ఓ ఏనుగు టెన్షన్‌కు గురిచేస్తోంది. గత నెలలో జిల్లాలో సంచరించిన ఏనుగు ఇప్పుడు మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లా సరిహద్దులోనే ఏనుగు సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు. మూడు రోజుల క్రితం గడ్చిరోలి జిల్లాలో సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తిని ఏనుగు హతమార్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అది మళ్లీ నార్త్ వైపే వెళుతున్నట్టు గుర్తించామని ఆయన వెల్లడించారు.
Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సీఎంపై తీవ్ర విమర్శలు
అంతేకాకుండా.. ఎవరు కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇండ్ల నుండి బయటకి వెళ్ళోద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు కూడా ఏనుగు సంచరించే ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరు వెళ్ళవద్దని, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన వెల్లడించారు. ఏనుగు కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, కర్జల్లి, బూదపెల్లి ,పెంచికల్పేట్ బెజ్జూర్ వైపు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్తు లందరూ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.
TTD: శ్రీవారి నడకదారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వాళ్లు రావొద్దు..!