Site icon NTV Telugu

Elephant Milk: ఏనుగుపాలు తాగితే చాలు వెంటనే మూర్ఛపోతారు.. కారణం అదే

Chittoor Elephant

Chittoor Elephant

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చాలా మంది ప్రజలు ఆవు, గేదె లేదా మేక పాలను తాగుతారు.  అయితే, పాలలో ఆల్కహాల్ శాతాన్ని కలిగివున్న జంతువు ఒకటి ఉంది. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తు ఈ పాలు తాగితే కలుగుతుంది. ఆ జంతువుత మరేదో కాదు అది ఏనుగు.   ఆడ ఏనుగు పాలలో దాదాపు 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఎందుకంటే ఏనుగులు చెరకును చాలా ఇష్టపడతాయని మనందరికీ తెలిసిందే. అవి చాలా వరకు చెరుకులను ఆహారంగా తీసుకుంటాయి. అందుకే చాలా సందర్భాలు ఏనుగులు చెరుకు తోటలపై పడి తిని వాటిని నాశనం చేశాయి అనే వార్తలను వింటూ ఉంటాం.  ఇక  చెరకులో పెద్ద మొత్తంలో ఆల్కహాల్-ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే  ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండడానికి ఇది కారణమవుతుంది.

Also Read: Naga Bhushana: ఫుట్ పాత్ పై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ చేసిన నటుడు… ఒకరు భార్య మృతి

ఏనుగు పాలు చాలా ప్రమాదకరం. వీటిలో ఉండే రసాయనాలు మనుషులకు హాని చేస్తాయి. అందుకే ఇవి తాగడానికి మనుషులకు ఉపయోగపడవు. ఈ పాలలో బీటా కేసైన్ ఉంటుంది. దీని కారణంగా పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది.  ఆఫ్రికన్ ఆడ ఏనుగులలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాచురైడ్లు ఉంటాయి. అందుకే మానవులు రెండు సిప్స్ తాగిన తర్వాత మూర్ఛపోతారని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ పాలలోని కార్బోహైడ్రేట్ అధిక పరిమాణంలో ఉంటాయి. వీటి కారణంగా వీటిని తాగితే  కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  ఏనుగులు రోజుకు 12 నుండి 18 గంటలు గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి, ఎందుకంటే వాటికి ప్రతిరోజూ 150 కిలోల ఆహారం అవసరం. ఆ కారణంగా చాలా రకాలైన రసాయనాలు వాటి శరీరంలోకి చేరుతాయి.

 

Exit mobile version