Site icon NTV Telugu

Eluru: ఏలూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలలు

Euru

Euru

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలల బాగోతం బయటపడింది. డ్యూటీకి వచ్చిన మహిళతో రొమాన్స్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జంగారెడ్డి‌గూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పర్రెడ్డిగూడెంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా డ్యూటీ చేస్తున్నాడు.

Read Also: Delhi Fire : ఢిల్లీలో వేడిగాలులు.. పార్కింగ్‌ చేసిన వాహనాల్లో మంటలు

అయితే, ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున కరెంట్ పోవడంతో ఉక్కపోత భరించలేక గ్రామ ప్రజలు సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేశారు. అయినా, అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్ రాకపోవడంతో కొంతమంది సబ్‌స్టేషన్ దగ్గరకు వెళ్లారు. ఇక, డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర్ రెడ్డి తప్పతాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ అతడ్ని నిలదీశారు. వెంటనే ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు గ్రామస్థులు కంప్లైంట్ చేశారు. దీంతో దిట్టుబాటు చర్యల్లో భాగంగా ఆపరేటర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.

Exit mobile version