Site icon NTV Telugu

Electricity Demand: వేసవి కాలాన్ని అధిగమించిన విద్యుత్ డిమాండ్

Power

Power

వేసవి కాలాన్ని విద్యుత్ డిమాండ్ అధిగమించింది. ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషానికి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఈరోజు 14136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని ట్రాన్స్‌ కో, జేఎన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వానాకాలంలో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం అన్నారు.

Read Also: Asaduddin Owaisi: దేశానికి ఏం చెప్పదలచుకున్నారు.. బీజేపీ సర్కార్‌పై ఒవైసీ ఫైర్‌

వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరగడంతో భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. డిమాండ్ కు తగ్గట్లుగా ఎక్కడ కూడా అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభాకర్ తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజు 12251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందని పేర్కొన్నారు.

Read Also: Girl Sneeze Challenge: కళ్లు తెరచి తుమ్మిన బాలిక… వీడియో వైరల్

రాష్ట్రంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. అందువల్ల దాదాపు 37 నుండి 40 శాతం విద్యుత్ వినియోగం అవుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రంగం విద్యుత్ వాడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. ఎంత డిమాండ్ వచ్చిన వ్యవసాయ రంగంకు, అన్ని రకాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్‌ రావు తెలిపారు.

Exit mobile version