Water Society Polls: కృష్ణా జిల్లా పెడనలో సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పెడన మండలం నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడి చేశారు. టీడీపీలో ఇరువర్గాల మధ్య ఆదిపత్యం పోరుతో మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాదు బలపర్చిన పామర్తి వెంకటేశ్వరరావుకి రెండు ఓట్లు రావడం దాడికి కారణమని తెలిసింది. ఎన్నికల అధికారి చేతిలో ఉన్న కాగితాలను చింపి పామర్తి వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన ఎన్నికల అధికారి మధు శేఖర్‌ను ఆస్పత్రికి తరలించారు. భయంతో నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలను ఇంచార్జ్ తహసీల్దార్ అనిల్‌కుమార్ వాయిదా వేశారు.
Read Also: CM Chandrababu: డోకిపర్రు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు పూజలు