NTV Telugu Site icon

EC Shocking Decision: ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్.. ఏకంగా 900మంది బదిలీ

Election Commission

Election Commission

EC Shocking Decision: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని సుమారు 900 మంది అధికారులను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు వివిధ గ్రేడ్లు, సర్వీసులలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నాయి. మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆప్, ఇతర పార్టీలు ప్రాణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: CM Jagan : నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్‌లోగా ఉద్యోగాలు

ఈసీ ఈ నెల 21న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి లేఖలు రాసింది. అధికారుల బదిలీ గడువు ముగిసిన తర్వాత వారి బదిలీలకు సంబంధించిన ఆదేశాలను పాటించినట్లుగా తెలిపే నివేదికలను సమర్పించాలని కోరింది. మిగిలిన 51 మంది అధికారులను తమ తమ ప్రధాన కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని కోరాలని తెలిపింది. వీరిలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. గురువారంనాటికి ఈ నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.

Read Also: Nirmala Sitharaman : గోదావరి జిల్లాల్లో తాగునీరు ఎద్దడి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం

కాగా.. ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ సమయంలోనే గుజరాత్‌ ఎలక్షన్ డేట్‌ని కూడా ప్రకటిస్తారని భావించినా ఈసీ వెల్లడించలేదు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెలాఖరులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుంది. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో చివరిసారి 2017లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.