Site icon NTV Telugu

Assembly Election Date: నేడు ఎలక్షన్ కమిషన్ సమావేశం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్

Central Election Cemtions

Central Election Cemtions

Assembly Election Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక పై క్షణం తీరిక లేకుండా గడిపే సమయం వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 12గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌ వంటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం ఉంది.

Read Also:Employee Health Care Trust : దసరా కానుక..! ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌

2018లో ఎన్నికల సంఘం అక్టోబర్ 6న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. 2018లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో 18 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న తొలి దశ పోలింగ్ జరగగా, 72 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరిగింది. అదే విధంగా, మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 28 న ఒకే దశలో ఎన్నికలు జరగగా, రాజస్థాన్, తెలంగాణలో డిసెంబర్ 7 న ఓటింగ్ జరిగింది. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు 11 డిసెంబర్ 2018న ఏకకాలంలో జరిగింది.

Read Also:Video: సోఫాతో మెట్రో ఎక్కిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Exit mobile version